వరుస ఫ్లాపులు .. ఆలోచనలో పడిన శర్వానంద్
- కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే శర్వానంద్
- 'జాను'పై పెట్టుకున్న నమ్మకం
- వరుసగా మూడు పరాజయాలు
కథల ఎంపిక విషయంలో శర్వానంద్ ఎంత మాత్రం తొందరపడడు. వేగంగా సినిమాలు చేయాలనే ఆత్రుత ఆయనలో ఎప్పుడూ కనిపించదు. కంటెంట్ ఉంటేనే కదిలే నటుడాయన. అలాంటి శర్వానంద్ ఖాతాలోకి 'జాను' పేరుతో మరో పరాజయం చేరిపోయింది. 22 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా, వసూళ్లపరంగా ఈ ఫిగర్ కి చాలా దూరంలో ఉండిపోవడం బాధాకరం.
ఇంతకుముందు శర్వానంద్ చేసిన 'పడి పడి లేచే మనసు'.. 'రణరంగం' సినిమాలు నిరాశపరిచాయి. తమిళ .. కన్నడ భాషల్లో ఆదరణ పొందిన కథే కదా అనే నమ్మకంతో 'జాను' చేస్తే అది కూడా పరాజయాన్ని చవిచూసింది. ఇలా వరుసగా మూడు పరాజయాలు ఎదురుకావడంతో శర్వానంద్ ఆలోచనలో పడినట్టుగా సమాచారం. ఇకపై కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు.