కోవిడ్-2019ను ఇలా నివారించొచ్చు.. నిపుణులు చెబుతున్నది ఇదే!

  • తాజా గాలి, వెలుతురుతో కోవిడ్‌కు నివారణ
  • వెచ్చని ప్రదేశంలో వైరస్ విస్తరించలేదు
  • అతినీలలోహిత కిరణాలకు వైరస్‌ను చంపే శక్తి ఉంది
ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కోవిడ్-2019 (కరోనా వైరస్) నివారణ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. నివారణ ఔషధ తయారీలో శాస్త్రవేత్తలు తలమునకలుగా ఉన్నారు. అయితే, కోవిడ్-2019కు భయపడాల్సిన అవసరం లేదని కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా దీని నుంచి దూరం జరగవచ్చని అంటున్నారు నిపుణులు. కోవిడ్ సూక్ష్మజీవులు పొడిగా, చల్లగా ఉండే వాతావరణంలో వృద్ధి చెందుతాయి. అంటే వేడి ప్రదేశాల్లో ఇవి వేగంగా విస్తరించలేవు. అందుకనే సింగపూర్‌లో ఈ కేసులు తక్కువ.

కోవిడ్‌ నివారణ చర్యలపై సింగపూర్ వైద్య ఆరోగ్యశాఖ చీఫ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ టాన్ ఖోర్ మాట్లాడుతూ.. గాలి, వెలుతురు తగిలే ప్రదేశాల్లో రోగులను ఉంచడం ద్వారా ప్రమాదకర ఈ వైరస్ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. తాజా గాలిలో ఉండాలని, ఏసీలను ఆఫ్ చేయాలని సూచించారు.

అలాగే, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. అలాగే, 30 డిగ్రీలకంటే ఎక్కువ ఉష్ణోగ్రత, గాలిలో 80 శాతానికి పైగా తేమ ఉండే వాతావరణంలో ఈ వైరస్ త్వరగా వ్యాపించదని వివరించారు. కోవిడ్ సోకిందని అనుమానం ఉన్నవారు తమ గది, కిటికి తలుపులను తెరిచి ఉంచాలన్నారు. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత (అల్ట్రావైలెట్) కిరణాలకు కోవిడ్ వైరస్‌ను చంపే శక్తి ఉందని మరో శాస్త్రవేత్త ప్రొఫెసర్ వాంగ్ లింఫా తెలిపారు.


More Telugu News