ప్రధాని మన్ కీ బాత్ వదిలి.. జన్ కీ బాత్ వినాలి: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే
- బీజేపీని సామాన్యుడి చీపురు తుడిచిపెట్టింది
- కేజ్రీవాల్ ను ఉగ్రవాదన్నారు... కానీ ఓడించలేకపోయారు
- ఆప్ పనులను చూసే ప్రజలు మళ్లీ గెలిపించారన్న ఆదిత్య థాకరే
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడంతో.. శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే స్పందిస్తూ.. ఈ ఎన్నికలు బీజేపీకి చెంపపెట్టన్నారు. ప్రధాని మోదీ తరచూ ‘మన్ కీ బాత్’ పేర కార్యక్రమాన్ని చేపడుతుంటారని ఇప్పుడు ఆయన ఆ కార్యక్రమాన్ని వదిలి ‘జన్ కీ బాత్’( ప్రజల మాటలు) వినాల్సిన అవసరమేర్పడిందని వ్యాఖ్యానించారు.
ఆప్ పార్టీ అధినేత సీఎం కేజ్రీవాల్ ను ఉద్ధవ్ అభినందించారు. పాతకాలపు నాటి సంప్రదాయాలను కొనసాగిస్తోన్న బీజేపీని, ఓ సామాన్యుడి చీపురు కట్ట తుడిచిపెట్టిందన్నారు. ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ ను ఉగ్రవాదంటూ బీజేపీ నేతలు విమర్శించారని, అయితే, ఆయన్ను ఓడించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే ఆప్ విజయంపై వ్యాఖ్యానిస్తూ.. ఈ విజయం ఆ పార్టీ ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపని పేర్కొన్నారు.