పోలీసులమంటూ చెప్పి ప్రయాణికురాలిపై అత్యాచారం
- లగేజీలో నిషేధిత ఉత్పత్తులున్నాయనీ బెదిరింపు
- తనిఖీ చేయాలంటూ బస్సు నుంచి దించివేత
- పాడుపడ్డ ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం
తెలంగాణలో ఓ ప్రయాణికురాలిని బెదిరించి అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన 37 ఏళ్ల మహిళ తన పన్నెండేళ్ల కుమారుడితో కలిసి కర్ణాటకలోని బీదర్ నుంచి హైదరాబాద్ కు బస్సులో వస్తోంది. బస్సు పస్తాపూర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే, ముగ్గురు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి తాము పోలీసులమని, లగేజీలో నిషేధిత పొగాకు ఉత్పత్తులున్నాయంటూ వాటిని తనిఖీ చేయాలని ఆ మహిళను కిందికి దింపారు.
లగేజీని పరిశీలిస్తూ.. ఇద్దరు వ్యక్తులు మహిళ కుమారుడిని తమ వద్ద ఉంచుకున్నారు. మరో వ్యక్తి తనతో మాట్లాడాలని చెప్పి ఆమెను పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన జహీరాబాద్ సీఐ సైదేశ్వర్, ఎస్సై వెంకటేశ్ కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.