క్షమాభిక్ష తిరస్కరణపై సుప్రీంను ఆశ్రయించిన నిర్భయ దోషి వినయ్ శర్మ

  • ఇప్పటికే రెండు సార్లు ఉరిశిక్ష వాయిదా 
  • వినయ్ శర్మకు క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి
  • అత్యున్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు
నిర్భయ దోషులు ఉరి తప్పించుకునేందుకు తమ న్యాయవాదుల సాయంతో అనేక ఎత్తుగడలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దోషి వినయ్ శర్మ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. వినయ్ శర్మ కొన్నిరోజుల క్రితం రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరగా, అతని అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. దాంతో, తన క్షమాభిక్ష దరఖాస్తు తిరస్కరణకు గురికావడాన్ని సవాల్ చేస్తూ వినయ్ శర్మ సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు అతని న్యాయవాది ఏపీ సింగ్ వెల్లడించారు. ఉరితీత అమలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో, నలుగురు దోషులు శరంపరగా పిటిషన్లు దాఖలు చేస్తూ మరింత ఆలస్యం చేస్తున్నారు.


More Telugu News