అరవింద్ కేజ్రీవాల్ కు 'కంగ్రాట్స్' చెప్పిన సీఎం జగన్
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తడాఖా
- జాతీయపార్టీలను మట్టికరిపించిన ప్రాంతీయ పార్టీ
- హృదయపూర్వక శుభాభినందనలు అంటూ ట్విట్టర్ లో స్పందించిన వైఎస్ జగన్
ఢిల్లీ పీఠంపై మరోసారి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కొలువు దీరనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ కు ఓటర్లు తిరుగులేని విజయం కట్టబెట్టారు. ఓ ప్రాంతీయ పార్టీ ధాటికి జాతీయ పార్టీలు మరోసారి కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో, ఆప్ ప్రభంజనంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్ కు హృదయపూర్వక శుభాభినందనలు అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చిరస్మరణీయ విజయం సాధించారని కొనియాడారు. మున్ముందు పదవీకాలంలో కేజ్రీవాల్ కు అంతే మంచి జరగాలని కోరుకుంటున్నట్టు తన ట్వీట్ లో ఆకాంక్షించారు.