హైదరాబాద్‌లో ఏటీఎంల్లో పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకులు
- చాంద్రాయణ గుట్టలో ఘటన
- ఐసీఐసీఐ, ఆక్సిస్ బ్యాంకుల ఏటీఎంలు దగ్ధం
- ఏటీఎంల చోరీ విఫలం కావడంతోనే చర్య?
హైదరాబాద్‌లోని చాంద్రాయణ గుట్టలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంల్లో పెట్రోల్ పోసి నిప్పంటించారు. బంగారు మైసమ్మ దేవాలయానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐసీఐసీఐ, ఆక్సిస్ బ్యాంకుల ఏటీఎంల వద్దకు వచ్చిన దుండగులు ఈ చర్యకు పాల్పడిపారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ఏంటీఎంలు దగ్ధమయ్యాయని చెప్పారు.
సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏటీఎం కేంద్రాల్లో మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే వచ్చి మంటలు ఆర్పారని పోలీసులు తెలిపారు. బృందంగా వచ్చిన కొందరు యువకుల ముఠా ఏటీఎంలో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. చోరీ యత్నంలో భాగంగా ఏటీఎంకు ఆయిల్ కూడా పూశారని తెలిసింది. అయినప్పటికీ అది తెరచుకోకపోవడంతో పెట్రోల్ పోసి తగులబెట్టి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.