వరుస ఫ్లాపుల వల్లనే గ్యాప్ తీసుకున్నాను: వరుణ్ సందేశ్
- నా తొలి సినిమా 'హ్యాపీడేస్'
- సోలో హీరోగా చేసిన సినిమా 'కొత్త బంగారు లోకం'
- మంచి కంటెంట్ ఉంటేనే చేస్తానన్న వరుణ్ సందేశ్
తెలుగులో తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్, ఆ తరువాత వరుస పరాజయల కారణంగా వెనుకబడ్డాడు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇదే విషయాన్నిగురించి ప్రస్తావించాడు.
"తెలుగులో నా తొలి సినిమా 'హ్యాపీడేస్' .. సోలో హీరోగా చేసిన సినిమా 'కొత్త బంగారు లోకం'. ఈ సినిమా నాకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఆ తరువాత అవకాశాలు వచ్చాయిగానీ విజయాలు దక్కలేదు. చేసిన సినిమాలన్నీ వరుసగా పరాజయం పాలవుతూ వచ్చాయి. దాంతో కాలం కలిసి రావడం లేదు .. ఈ సమయంలో నేను ఏ సినిమా చేసినా ఫ్లాపు అవుతుందని భావించి గ్యాప్ తీసుకున్నాను. పారితోషికం ఇవ్వకపోయినా ఫరవాలేదు .. మంచి కంటెంట్ మాత్రం ఉండాలి. అలాంటి కథ వచ్చినప్పుడే చేద్దామనే ఉద్దేశంతో, కొంతకాలం పాటు అమెరికాలో ఉండిపోయాను" అని చెప్పుకొచ్చాడు.