అంతర్జాతీయ పత్రికలనే మేనేజ్ చేసినోళ్లకు దేశీయ పత్రికలు ఓ లెక్కా! : విజయసాయిరెడ్డి
- ఎకనామిక్స్ టైమ్స్ కథనంపై ట్వీట్
- సంపాదించిన లక్ష కోట్లలో ఉల్లిపొరంత ఖర్చు చేస్తే చాలు
- 40 ఏళ్ల పరిశ్రమ మనుగడ రహస్యం ఇదే కదా అంటూ వ్యాఖ్య
అంతర్జాతీయ పత్రికలనే మేనేజ్ చేయగలిగిన వారికి జాతీయ పత్రికలు ఒక లెక్కా అని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రం సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల పరిస్థితి తిరోగమనంలో ఉందని, సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో పెట్టుబడులకు ప్రమాదం ఉందంటూ ఎకనామిక్స్ టైమ్స్‌లో వచ్చిన కథనంపై విజయసాయి తనదైన శైలిలో స్పందించారు.
‘ఆ పేపర్లో ఏదో కథనం వచ్చిందని బాబు భజంత్రీలు మురిసిపోతున్నారు. నలభై ఏళ్ల ఇండస్ట్రీకి ఇదో లెక్కా’ అన్నారు. సంపాదించిన లక్ష కోట్లలో ఉల్లి పొరంత ఖర్చుచేస్తే ఇలాంటి కథనాలు ఎన్నైనా రాయించుకోవచ్చని, నలభై ఏళ్లుగా ఆయనగారి మనుగడ రహస్యం ఇదే కదా?' అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.