'విక్రమ్ వేద' రీమేక్ లో చరణ్

'విక్రమ్ వేద' రీమేక్ లో చరణ్
  • తమిళంలో హిట్ కొట్టిన 'విక్రమ్ వేద'
  • మాధవన్ పాత్రలో చరణ్ 
  • 2022లో సెట్స్ పైకి  
తమిళనాట 2017లో విడుదలైన విజయవంతమైన చిత్రాలలో 'విక్రమ్ వేద' ఒకటి. పుష్కర్ - గాయత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, మాధవన్ - విజయ్ సేతుపతి ప్రధానమైన పాత్రలను పోషించారు. వైవిధ్యభరితంగా మలచబడిన ఈ రెండు పాత్రలు సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. అలాంటి ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రీమేక్ చేయాలనుకున్నారు. ప్రధాన పాత్రలకి గాను రానా - రవితేజ పేర్లు వినిపించాయి.

అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. మళ్లీ ఇప్పుడు అల్లు అరవింద్ ఈ ప్రాజెక్టు గురించిన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళంలో మాధవన్ చేసిన పాత్రను చరణ్ తో చేయిస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. మరో పాత్రను రవితేజతో చేయిస్తారా? రానాను తీసుకుంటారా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. 2022లో ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వెళుతుందని చెప్పుకుంటున్నారు.


More Telugu News