జేసీ దివాకర్ రెడ్డికి షాక్.. భద్రతను పూర్తిగా తొలగించిన ప్రభుత్వం
- సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకు నిర్ణయం
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు
- ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఆయనకు పూర్తిగా భద్రతను తొలగించింది. గతంలో దివాకర్ రెడ్డికి 2 ప్లస్ 2 భద్రత ఉండేది. దీన్ని 1 ప్లస్ 1కు తగ్గించిన వైసీపీ ప్రభుత్వం తాజాగా భద్రతను పూర్తిగా ఉపసంహరించుకుంది. రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు జేసీకి భద్రతను తొలగించడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. జేసీ కుటుంబంపై జగన్ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికితోడు ఆయనకు చెందిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి భూములను రద్దు చేశారు.