సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యపడదంటూ.. రెండు బిల్లులను వెనక్కి పంపిన ఏపీ అసెంబ్లీ కార్యదర్శి.. నెక్స్ట్ ఏంటి?
- ఏపీలో మళ్లీ వేడెక్కిన రాజకీయం
- సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదన్న అసెంబ్లీ కార్యదర్శి
- చైర్మన్ నిర్ణయంపై సర్వత్ర ఆసక్తి
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం మళ్లీ వేడెక్కింది. శాసనమండలి చైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి పంపిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను అసెంబ్లీ కార్యదర్శి నిన్న వెనక్కి పంపినట్టు తెలుస్తోంది. 154వ నిబంధన ఆధారంగా సెలక్టు కమిటీ ఏర్పాటు సాధ్యపడదంటూ చైర్మన్ కు తిప్పి పంపిన ఫైల్‌లో అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు షరీఫ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది.
మండలి సమావేశాలు ముగిసినప్పటి నుంచీ సెలక్ట్ కమిటీ ఏర్పాటుపై తీవ్ర చర్చలు జరుగుతుండగా, ఇప్పుడు అసెంబ్లీ కార్యదర్శి మండలి చైర్మన్ పంపిన ఫైల్‌ను వెనక్కి పంపడం చర్చనీయాంశంగా మారింది.
మండలి సమావేశాలు ముగిసినప్పటి నుంచీ సెలక్ట్ కమిటీ ఏర్పాటుపై తీవ్ర చర్చలు జరుగుతుండగా, ఇప్పుడు అసెంబ్లీ కార్యదర్శి మండలి చైర్మన్ పంపిన ఫైల్‌ను వెనక్కి పంపడం చర్చనీయాంశంగా మారింది.