తొలుత కివీస్ బౌలింగ్... భారత్ పరువు నిలిచేనా?
- టాస్ గెలిచిన న్యూజిలాండ్
- క్లీన్ స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న న్యూజిలాండ్
- ఇప్పటికే సీరీస్ విజయం
టీ-20 సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసినప్పటికీ, ఇప్పటికే వన్డే సీరీస్ ను కోల్పోయిన భారత క్రికెట్ జట్టు, నేడు న్యూజిలాండ్ తో జరిగే చివరి వన్డేలో అయినా గెలిచి, పరువు నిలుపు కోవాలని భావిస్తోంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుండగా, టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ని కూడా గెలిచి, టీ-20ల్లో క్లీన్ స్వీప్ కు ప్రతీకారం తీర్చుకోవాలన్న ఏకైక లక్ష్యంతో న్యూజిలాండ్ జట్టు బరిలోకి దిగుతోంది.
భారత జట్టు తరఫున మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, మనీశ్ పాండే, శార్దూల్ ఠాకూర్, కుల్ దీప్, సైనీ, బుమ్రాలు ఆడనుండగా, న్యూజిలాండ్ తరఫున గప్టిల్, నికోల్స్, విలియమ్సన్, రాస్ టేలర్, లేథమ్, నీషమ్, టిమ్ సౌధీ, గ్రాండ్ హోమ్, కైల్ జేమీసన్, శాంట్రన్, బెనెట్ బరిలోకి దిగనున్నారు.