మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తీరుపై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆశ్చర్యం!

  • మహంకాళి ఆలయ అభివృద్ధి కోసం సీఎంను కలిసిన అక్బరుద్దీన్
  • ఆయన నిజంగానే మంచి మనిషిగా మారిపోయారా? అంటూ తస్లీమా ఆశ్చర్యం
  • గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన రచయిత్రి
లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీమహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలంటూ మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడంపై  బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముస్లింలకు 15 నిమిషాలపాటు స్వేచ్ఛనిస్తే దేశంలోని వంద కోట్ల మంది హిందువులను తుడిచిపెట్టేస్తామన్న అక్బరుద్దీనే ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హిందువులు, హిందూ ఆలయాలపై అక్బరుద్దీన్‌ తీరు మారిపోవడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఆయన నిజంగానే మంచి మనిషిగా మారిపోయారా? లేక ముసుగు తొడుక్కున్నారా? అని తస్లీమా ప్రశ్నించారు.
 
కాగా, ఆలయ అభివృద్ధి కోసం సీఎంను కలిసిన అక్బరుద్దీన్‌ను ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రశంసించారు. ఎమ్మెల్యే విన్నపానికి స్పందించిన సీఎం రూ.10 కోట్లు విడుదల చేయడం హర్షణీయమన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేను సన్మానించాలని భావించిన ఆలయ ప్రతినిధులు.. ఆయన అందుబాటులో లేకపోవడంతో మజ్లిస్ ఎమ్మెల్యేలను సన్మానించారు.  


More Telugu News