గర్భిణిని జోలెలో మోసుకుంటూ తీసుకెళ్లిన ఒడిశా ఎమ్మెల్యే!
- నవరంగపూర్ జిల్లాలో ఘటన
- రహదారి లేకపోవడంతో రాని అంబులెన్స్
- మానవత్వం చూపిన ఎమ్మెల్యే
ఏ విధమైన వాహన సదుపాయం లేని ఓ మారుమూల ప్రాంతంలో నిండు గర్భిణి పురుటి నొప్పులతో బాధపడుతుండగా, విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఆమెను జోలెలో మోసుకుంటూ తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన ఒడిశాలోని నవరంగపూర్ జిల్లా, పపడహండి సమితి సమీపంలోని కుసుముగుడలో జరిగింది.
నెలలు నిండిన జెమ బెహర అనే మహిళకు సోమవారం ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ గ్రామానికి రహదారి లేకపోవడంతో అంబులెన్స్ రాలేని పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి వెంటనే గ్రామానికి వచ్చారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన జోలీలో ఆమెను ఉంచి, మోసుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చారు. తమ పట్ల మానవత్వం చూపిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు చెప్పారు.