టీ20 క్రికెట్ చరిత్రలో... కివీస్ మహిళా జట్టు కెప్టెన్ సోఫీ సరికొత్త రికార్డ్
- వరుసగా ఐదు టీ20ల్లో 50కి పైగా పరుగులు
- పురుషుల క్రికెట్లో బ్రెండన్ మెక్ కల్లమ్, క్రిస్ గేల్ వెనక్కి
- మహిళల క్రికెట్లో మిథాలీ రాజ్ ను అధిగమించిన సోఫీ
న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా ఈ రోజు జరిగిన నాలుగో మ్యాచ్ లో కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్ టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. వరుసగా తాను ఆడిన ఐదు టీ20 మ్యాచుల్లో 50 పరుగులకు పైగా చేసిన తొలి క్రికెటర్ గా నిలిచింది. పురుషుల క్రికెట్లో బ్రెండన్ మెక్ కలమ్, క్రిస్ గేల్ లు వరుసగా చెరి నాలుగు టీ20ల్లో మాత్రమే 50 పరుగులు చేశారు. అటు మహిళా క్రికెటర్లలో వరుసగా నాలుగు టీ20ల్లో 50కి పరుగులు చేసిన మిథాలీరాజ్ ను కూడా సోఫీ వెనక్కి నెట్టింది.
సోఫీ ప్రస్తుతం ఆడుతున్న సిరీస్ కు ముందు భారత్ తో జరిగిన టీ20లో 72 పరుగులు చేయగా, తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు జరిగిన మూడు టీ20ల్లోనూ వరుసగా 54, 61, 77 పరుగులు చేసింది. ఈ రోజు జరిగిన నాలుగో టీ20లో 105 పరుగులు చేసి తన బ్యాటింగ్ పటిమను చాటింది. ఇందుకు ఆమె 65 బంతులు ఎదుర్కొంది. ఇందులో 12 ఫోర్లు, 6 సిక్సర్లున్నాయి. ఈ మ్యాచ్ లో కివీస్ జట్టు 69 పరుగులతో గెలిచి ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య చివరి మ్యాచ్ గురువారం జరుగనుంది.