: 1500 కొత్త రిటైల్ స్టోర్లతో యునినార్


యునినార్ సంస్థ సరికొత్తగా మార్కెట్లో దూసుకుపోయేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు ఆ సంస్థ సీఈవో యోగేష్ మాలిక్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో యునినార్ అభివృద్ధి ప్రణాళికను హైదరాబాదులో ఈ రోజు ఆయన వివరించారు. ఫోన్ లో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరగడంతో ఆ దిశగా వ్యాపారాభివృద్ధికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇతర ఆపరేటర్ల కంటే 30 శాతం టారిఫ్ లను ప్రవేశపెట్టి, గత మూడేళ్లుగా యునినార్ అభివృద్ధి దిశగా పయనించిందని తెలిపారు. 42 లక్షల వినియోగదారులతో మూడున్నరేళ్లలోనే రాష్ట్రంలో యునినార్ మూడో స్థానంలో నిలిచిందన్నారు. సేవల విస్తరణలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలో 1500 రిటైలర్స్, 140 నెట్ వర్క్ సైట్లను కొత్తగా ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. కొత్త రిటైల్ పాయింట్ల చేరికతో రాష్ట్రంలో రిటైల్ స్టోర్ల సంఖ్య 55 వేలకు చేరుతుందని బిజినెస్ సర్కిల్ హెడ్ సతీష్ కన్నన్ తెలిపారు.

  • Loading...

More Telugu News