: 'ఆదివాసీ రాష్ట్రం' ఏర్పాటుకు డిమాండ్!


నాగరికత, అభివృద్ధి పేరుతో తమ ప్రయోజనాలను కాలరాస్తున్నారని, అందుకే తమకు ప్రత్యేకంగా ఆదివాసీ రాష్ట్రాన్ని కేటాయించాలని దండకారణ్య రాష్ట్రసాధికారత సమితి డిమాండ్ చేసింది. ఎన్నో ఉపనదులు, ఖనిజ సంపద ఉన్న ఆదీవాసీ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించి తమను తాము పాలించుకునే హక్కు కల్పించాలని ఆ సమితి కన్వీనర్ చెండా ఏలియా డిమాండ్ చేశారు. బ్రిటిష్ వారు కూడా ఆదివాసీలపై చట్టాలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ఇస్తే ఆదివాసీలను అణగద్రొక్కుతారని ఆయన పేర్కొన్నారు. రాజకీయనాయకులు పేర్కొన్నట్టు ప్రత్యేక పాడేరు ఏజెన్సీ వల్ల ఆదీవాసీలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. బురియా కమిటీ నివేదిక, పీసీ చట్టాలను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాలన్నింటినీ కలిపి ఆదివాసీ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News