: భారత్ లో ఆసీస్ టూర్ ఖరారు


ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వచ్చే అక్టోబరులో భారత్ లో పర్యటించనుంది. ఈ స్వల్ప కాలిక పర్యటనలో భాగంగా ఆసీస్ జట్టు టీమిండియాతో 7 వన్డేలు, ఓ టి20 మ్యాచ్ ఆడుతుంది. ఈ టూర్ అక్టోబరు 10న జరిగే ఏకైక టి20తో ఆరంభమవుతుంది. ఇక అక్టోబరు 13న పుణేలో జరిగే మ్యాచ్ తో వన్డే సిరీస్ మొదలవనుంది. బెంగళూరులో నవంబరు 2న జరిగే వన్డేతో సిరీస్ ముగుస్తుంది. ఇవన్నీ డే అండ్ నైట్ మ్యాచ్ లే అని బీసీసీఐ నేడు ఓ ప్రకటనలో తెలిపింది.

టూర్ షెడ్యూల్ వివరాలు..

అక్టోబరు 10- టి20 మ్యాచ్ (రాజ్ కోట్)

అక్టోబరు 13- తొలి వన్డే (పుణే)

అక్టోబరు 16- రెండో వన్డే (జైపూర్)

అక్టోబరు 19- మూడో వన్డే (మొహలీ)

అక్టోబరు 23- నాలుగో వన్డే (రాంచీ)

అక్టోబరు 25- ఐదో వన్డే (కటక్)

అక్టోబరు 30- ఆరో వన్డే (నాగపూర్)

నవంబరు 2- ఏడో వన్డే (బెంగళూరు)

  • Loading...

More Telugu News