: ధూమపాన రహిత హిమాచల ప్రదేశ్


స్మోకింగ్ మనల్ని లోలోపలే కాల్చేస్తుంది. ఈ విషయం తాగేవారితో అంటే.. తాగకపోతే చచ్చిపోకుండా ఉంటారనే గ్యారంటీ ఉందా? అని తిరగబడతారు. అందుకే పాలకుల వైపు నుంచి చిత్తశుద్ధి, స్వచ్ఛంద సంస్థల తోడ్పాటు ఉంటేగానీ ధూమపానాన్ని తగ్గించలేం. ఇందుకు ఉదాహరణే హిమాచల్ ప్రదేశ్! అక్కడి ప్రభుత్వం చిత్తశుద్ధితో పొగతాగడాన్ని నియంత్రిస్తోంది. తాజాగా స్మోకింగ్ ఫ్రీ స్టేట్ (ధూమపాన రహిత రాష్ట్రం)గా ప్రకటించుకుంది.

తాగేవారు ఎలా అయినా పోనీయండి.. ఆ పొగతో పక్కనున్నవారి ఆరోగ్యాన్ని హరించే హక్కు వారికెక్కడిది? ఈ ప్రశ్నకు స్మోకర్లే సమాధానం చెప్పాలి. ఇలా తాగేవారు, ప్రజారోగ్యానికి విఘాతంగా పరిణమించినందున హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక చట్టంతో అక్కడ బహిరంగ ధూమపానాన్ని దాదాపుగా నియంత్రించింది. ఇందుకు అనేక చర్యలు తీసుకుంది. ఇకపై ఇళ్లల్లో పొగతాగడాన్ని కూడా తగ్గించాలన్నదే తమ ధ్యేయమని ఆ రాష్గ్ర వైద్యశాఖ మంత్రి కౌల్ సింగ్ ఠాకూర్ చెప్పారు. బహిరంగ ధూమపానం కంటే ఇళ్లల్లో తాగడమే ప్రమాదకరమని, ఆ పొగతో ఇంట్లోని వారికి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. 2,500 పంచాయతీలు, 57తాలూకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పొగాకు చట్టాన్ని అమలు చేస్తున్నట్లు తీర్మానం చేశాయని చెప్పారు. పొగాకు ఉత్పత్తులను రాష్ట్రం నుంచి ఏరిపారేయాలన్న ఉద్దేశంతోనే వాటిపై పన్నులను 36శాతానికి పెంచామని వివరించారు. సిక్కిం రాష్ట్రం కూడా ధూమపాన రహిత రాష్ట్రంగా ఇప్పటికే ప్రకటించుకుంది.

  • Loading...

More Telugu News