: తెలంగాణ సభకు ఏదీ ఆహ్వానం?: మంత్రి ముఖేష్ గౌడ్


హైదరాబాద్ లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన సభకు తననెవరూ ఆహ్వానించలేదని మంత్రి ముఖేష్ గౌడ్ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం పుణ్యక్షేత్రంలో ఈ ఉదయం ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ఆ సభకు తనను పిలవకపోవడంతో హాజరుకాలేదని మంత్రి వివరణ ఇచ్చారు. ఇక తెలంగాణ అంశంపై స్పందిస్తూ.. అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయమైనా తమకు సమ్మతమే అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News