: సిమ్ కార్డు కావాలంటే ఇకపై వేలిముద్ర వేయాల్సిందే


సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటే ఇకపై ఫొటో, చిరునామా, గుర్తింపు ధ్రువీకరణలతోపాటు చక్కగా దరఖాస్తుపై ఒక వేలిముద్ర కూడా వేయాల్సి ఉంటుంది. లేదా అక్కడే ఉన్న బయోమెట్రిక్ మిషన్ లో వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన త్వరలో అమల్లోకి వచ్చే అవకాశముంది. అభ్యర్థుల వివరాలను ప్రత్యక్షంగా ధ్రువీకరించుకున్న తర్వాతే సిమ్ కార్డులు జారీ చేయాలంటూ టెలికాం శాఖ ఇప్పటికే నెట్ వర్క్ కంపెనీలను ఆదేశించింది. అయినా, అనర్హులు, సంఘ విద్రోహ శక్తుల చేతిలోకి సిమ్ కార్డులు వెళ్లిపోతున్నాయని కేంద్ర హోంశాఖ గుర్తించింది.

దీంతో సిమ్ కార్డుల జారీకి దరఖాస్తుదారుల వేలిముద్రలు కూడా తీసుకోవాలంటూ నెట్ వర్క్ కంపెనీలను ఆదేశించాలని కేంద్ర హోంశాఖ టెలికాం శాఖను కోరింది. అలాగే, మొబైల్ వినియోగదారుల బయో వేలిముద్రలతో ఒక డేటాబేస్ ను ఏర్పాటు చేసి దానిని నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ కు అనుసంధానించాలని సూచించింది. దీంతో నేరస్థులను పట్టుకోవడం తేలికవుతుందని హోంశాఖ భావన.

  • Loading...

More Telugu News