: మళ్లీ బోల్తా కొట్టిన భారత్


భారత క్రికెట్ జట్టుకు విండీస్ నేలపై మరో ఘోర పరాజయం. ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా భారత్ సోమవారం విండీస్ చేతిలో తొలి పరాజయాన్ని చవిచూసింది. అయినా భారత జట్టు తన తీరును మార్చుకోలేదు. దాంతో మంగళవారం శ్రీలంక చేతిలో కూడా ఓటమి పాలైంది. అదీ సాధారణ ఓటమి కాదు. పెద్ద పరాభవం. భారత్ పై శ్రీలంక 161 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలింగ్ ఎంత దారుణంగా ఉందంటే శ్రీలంక ఓపెనర్లు ఉపుల్ తరంగ(171), జయవర్ధనే(107) కలిసి 213 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక జట్టు 348 పరుగులు చేసింది. భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 44.5 ఓవర్లలో అన్ని వికెట్లనూ కోల్పోయి ఓటమిని అంగీకరించింది. ఒక్క జడేజా మాత్రమే 49 పరుగులు చేశాడు. మిగతా వారు పెద్దగా రాణించలేకపోయారు. హెరాత్, సేననాయకే, మలింగ భారత్ వికెట్లు తీయడంలో కీలక పాత్ర పోషించారు.

  • Loading...

More Telugu News