: ప్రభుదేవా 'రామయ్యా వస్తావయ్యా' ప్రచార చిత్రం విడుదల
ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వం లో రూపొంది తెలుగులో సూపర్ హిట్టయిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమా హిందీలో 'రామయ్యా వస్తావయ్యా'గా అతని దర్శకత్వంలోనే రీమేక్ అవుతోంది. ఈ సినిమా ప్రచార చిత్రం ఈ రోజు హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ హోటల్ లో విడుదల చేశారు. ఈ సినిమాలో గిరీష్ కుమార్ హీరోగా సిద్దార్ధ్ పాత్రద్వారా పరిచయమౌతుండగా, అతని సరసన శృతి హాసన్ త్రిష పాత్రలో అలరించనుంది. ఈ కార్యక్రమంలో హీరో గిరీష్ కుమార్, ప్రభుదేవా డాన్స్ చేసి అలరించగా, నిర్మాత కుమార్ తరోణి పాల్గొన్నారు.