: తొలి మైనార్టీ మంత్రికి జాత్యహంకార వేధింపులు


ఆస్ట్రేలియా తొలి మైనార్టీ మంత్రికి జాత్యహంకార వేధింపులు స్వాగతం పలికాయి. ఆస్ట్రేలియా ప్రధానిగా కెవిన్ రూడ్ ప్రమాణ స్వీకారం తరువాత హూసిక్ అనే సభ్యుడ్ని బ్రాడ్ బండ్ పార్లమెంటు సెక్రటరీగా నియమించారు. నియామకం తరువాత తనకు బైబిల్ పై నమ్మకం లేదంటూ, అతను ఖురాన్ పై ప్రమాణం చేశాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా గవర్నర్ క్వెన్ టిన్ బ్రేసీ, ఇది మన దేశ బహుళ సంస్కృతిని చాటే గొప్ప రోజని ప్రకటించారు. అయితే ఆ తరువాత ప్రతిపక్ష నాయకుడు 'హ్యూసిక్ ఆస్ట్రేలియా గౌరవాన్ని అతను కాలరాసాడని మండిపడ్డారు'. దీంతో అతని ఫేస్ బుక్ మొత్తం అతను ఆస్ట్రేలియన్ కాదంటూ, జాతి ద్రోహి అంటూ వ్యాఖ్యలతో నిండిపోయింది. దీంతో లేబర్ మినిష్టర్ సోషల్ వెబ్ సైట్లలో హ్యూసిక్ వైఖరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. హూసిక్ బోస్నియా జాతిమూలాలు కలిగిన ముస్లిం వ్యక్తి కావడం విశేషం.

  • Loading...

More Telugu News