: జగనన్నది కాంగ్రెస్ డీఎన్ఏ కాదు: షర్మిల
వైఎస్సార్ కాంగ్రెస్ ది తమ డీఎన్ఏనే అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. జగనన్నది కాంగ్రెస్ డీఎన్ఏ కాదని అన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరంలో ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. జగన్ ది కాంగ్రెస్ డీఎన్ఏ అని వారు చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. జగన్ డీఎన్ఏ పేరు విశ్వసనీయత అని నొక్కి చెప్పారు.