: ఆర్టీఐపై అవగాహన కలిగించేందుకు ప్రజల్లోకి వెళతాం: సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్
సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన కలిగించేందుకు పలు కార్యక్రమాలు రూపొందించినట్టు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరక్టర్ జనరల్ ఎన్ కే సిన్హా చెప్పారు. మరింత సులువుగా అర్థమయ్యేలా ప్రసారశాఖ సహాయంతో లఘు చిత్రాలు రూపొందించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శిస్తామని ఆయన అన్నారు.
హోర్డింగులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమాచార హక్కు చట్టం గురించి ప్రసార సాధనాల ద్వారా ప్రచారం చేసే అంశంపై ఎలక్ట్రానిక్ మీడియాతో ఆర్టీఐ ఉన్నత స్థాయి కమిటీ మంగళవారం సమావేశమైంది. కాగా, ఈ కార్యక్రమాలను సమాచార, ప్రజా సంబంధాల శాఖ నిధులతో చేపడతామని ఎన్ కే సిన్హా తెలిపారు.