: డ్రాగ్ ఫ్లికర్ సిందీప్ సింగ్ ఆసియా టోర్నీకి దూరం


ఆసియా కప్ హాకీ టోర్నీకి ప్రముఖ ఆటగాడు సందీప్ సింగ్ దూరమయ్యాడు. ఆసియా కప్ కు సన్నద్దమయ్యే ప్రాబబుల్స్ జాబితాలో ఉన్న సందీప్ సింగ్ భారత హాకీ జట్టుకు వెన్నుముక లాంటి ఆటగాడు. డ్రాగ్ ఫ్లికర్ గా గోల్స్ చెయ్యడంలో సిద్ధహస్తుడు. కార్నర్ లను అసాధారణంగా ఫ్లిక్ చేసి భారత్ కు స్కోరు సాధించడంలో దిట్టగా పేరు సంపాదించాడు.ఫార్వర్డ్ స్థానంలో ఆడే సందీప్ సింగ్ టోర్నీకి దూరమవ్వడం భారత్ కు కాస్త నిరాశ కలిగించే అంశమే. అలాగని భారత హాకీ జట్టులో ప్రతిభావంతులు లేరని కాదు. ఆసియా కప్పు పూల్ బీలో భారత్, కొరియా, బంగ్లాదేశ్, ఒమన్ దేశాలు ఉన్నాయి. లీగ్ దశలో ఆ జట్లు ఒకదానితో ఒకటి తలపడనున్నాయి. దాయాది పాక్ పూల్ 'ఏ'లో ఉంది. టోర్నీ ఆగష్టు 24 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరుగనుంది.

  • Loading...

More Telugu News