: 'పంచాయతీ' సమరంలో ఎస్టీ మహిళ కిడ్నాప్


రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కీదేడు పంచాయతీని ఎస్టీ మహిళకు అధికారులు రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ గ్రామంలో కేవలం ఒకే ఒక ఎస్టీ కుటుంబం నివాసం ఉంటోంది. దీంతో ఆ కుటుంబానికి చెందిన మహిళను ఓ పార్టీకి చెందిన నాయకులు అపహరించి తమ ఆధీనంలో ఉంచుకున్నారు. తన తల్లిని ఆ కిడ్నాపర్ల చెరనుంచి విడిపించాలంటూ ఆమె కుమార్తెలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .

  • Loading...

More Telugu News