: స్నోడెన్ కు ఆశ్రయం నిరాకరించిన భారత్


అగ్రరాజ్యం అమెరికా రహస్య కార్యకలాపాలను ప్రపంచానికి బహిర్గతం చేస్తున్న ఎడ్వర్డ్స్ స్నోడెన్ కు భారత్ రాజకీయ ఆశ్రయం నిరాకరించింది. స్నోడెన్ విన్నపాన్ని పరిశీలించిన మీదట, తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. స్నోడెన్ కోరికను మన్నించాల్సిన అత్యయిక స్థితి ఏమీ కనిపించడంలేదని ఆయన నేడు ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం రష్యాలోని మాస్కో విమానాశ్రాయంలో ఆశ్రయం పొందుతున్న స్నోడెన్.. రాజకీయ శరణు కోరుతూ పలు దేశాలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News