: కేటీఆర్ అక్రమాలపై విచారణ జరపండి: సీఎంకు టీడీపీ నేతల వినతి


టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు అక్రమాలపై విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నేడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. కేటీఆర్ వ్యవహారాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు కిరణ్ ను కోరారు. కాగా, కేటీఆర్ పలు భూదందాల్లో కోట్లు వెనకేసుకున్నట్టు ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రికలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News