: అమెరికా గూఢ'చౌర్యం' సబబే అంటోన్న భారత్


పలు దేశాల దౌత్యాకార్యాలయాలపై అగ్రరాజ్యం అమెరికా నిఘా వుంచి, కీలక సమాచారం తస్కరిస్తోందని ఎడ్వర్డ్ స్నోడెన్ సంచలనాత్మక రీతిలో వెల్లడించగా.. భారత్ మాత్రం తద్విరుద్ధంగా స్పందించింది. అమెరికా చర్యలను సమర్థిస్తున్నట్టు భారత విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. బ్రూనైలో జరిగిన ఆసియా సెక్యూరిటీ ఫోరం సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఖుర్షీద్ ఓ రేడియో ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇలాంటి నిఘా కార్యక్రమాల వల్లే కీలక సమాచారం వెలుగు చూసిందని, పలుదేశాల్లో తీవ్రవాద దాడులను నిరోధించడానికి ఈ సమాచారాన్ని వినియోగించి ఉంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఈమెయిళ్ళు, ఫోన్ కాల్స్ ను విశ్లేషించడమే అని, తస్కరణ కాదని ఖుర్షీద్ అన్నారు.

  • Loading...

More Telugu News