: ఆకాశంలో విమానం డోర్ తెరవబోయిన శ్రీలంక క్రికెటర్


శ్రీలంక క్రికెట్ సభ్యుడు పీకలదాకా తాగి ఉన్నాడు. జట్టు సభ్యులతో కలిసి విమానం ఎక్కాడు. ఉన్నట్లుండి సీట్ లోంచి లేచి వచ్చి నడుస్తున్న విమానం డోర్ తెరవబోయే సరికి ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే పోయినంత పనైంది.

ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టు బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 777 విమానంలో గ్రెనెడా నుంచి లండన్ లోని గత్విక్ విమానాశ్రయానికి ప్రయాణిస్తోంది. విమానం మరో రెండు గంటల్లో లండన్ కు చేరుకుంటుందనగా .. శ్రీలంక క్రికెటర్ పైకి లేచాడు. విమానం కేబిన్ డోర్ పట్టుకుని తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంతకీ రాకపోవడంతో దాంతో కుస్తీ పడుతున్నాడు. అది తెరుచుకుంటే గాలికి విమానం గతితప్పి ప్రమాదం జరగడం ఖాయం. ఇది తలచుకున్న ప్రయాణికులు భయకంపితులయ్యారు. ఈ లోపు కేబిన్ సిబ్బంది ఆ క్రికెటర్ దగ్గరకు వచ్చి కంట్రోల్ చేశారు.

విషయమేమిటంటే, ఆ క్రికెటర్ కేబిన్ డోర్ ను టాయిలెట్ డోర్ అనుకున్నాడట. అక్కడి ప్రయాణికులు మాత్రం అతడు బాగా తాగున్నాడని అంటున్నారు. ఒంటిపై శ్రీలంక క్రికెట్ టీమ్ టీ షర్టు వేసుకున్నాడని చెప్పారు. కానీ, అతడి పేరు బయటకు రాలేదు. తర్వాత చేసిన తప్పునకు క్షమించమని తాగుబోతు క్రికెటర్ కోరడంతో విమానం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వదిలేశారట. ఈ విషయాన్ని ప్రయాణికులను ఉటంకిస్తూ డెయిలీ మెయిల్ పేర్కొంది.

  • Loading...

More Telugu News