: వింబుల్డన్ క్వార్టర్స్ కు దూసుకెళ్ళి న టాప్ సీడ్
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాస్ కోర్టు టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ నొవక్ జోకోవిచ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్ళాడు. ప్రీక్వార్టర్ ఫైనల్లో ఈ సెర్బ్ వీరుడు 6-1, 6-4, 7-6 (4)తో అమెరికా క్రీడాకారుడు, ప్రపంచ 13వ ర్యాంకర్ టామీ హాస్ ను చిత్తుచేశాడు. ఈ మ్యాచ్ లో తొలి రెండు సెట్లను అలవోకగా గెలుచుకున్న జోకోవిచ్ మూడో సెట్లో హాస్ నుంచి కాసింత ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. అయితే టైబ్రేకర్ లో నెగ్గి ఆ సెట్ తో పాటు మ్యాచ్ నూ కైవసం చేసుకున్నాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఈ వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడు.. థామస్ బెర్డిచ్ (7) తో తలపడనున్నాడు.