: భారత్ శరణు కోరిన 'విజిల్ బ్లోయెర్' స్నోడెన్


అమెరికా రహస్య నిఘా వ్యవహారాల గుట్టును బయటపెట్టిన ప్రజావేగు(విజిల్ బ్లోయెర్) స్నోడెన్ భారత్ ఆశ్రయం కోరాడు. రాజకీయ ఆశ్రయం కల్పించాలని అభ్యర్థించాడు. శరణు కల్పించాలని కోరుతూ భారత్, చైనాతోపాటు మొత్తం 19 దేశాలకు స్నోడెన్ దరఖాస్తులు పంపాడని వికీలీక్స్ మంగళవారం వెల్లడించింది. అమెరికా జాతీయ భద్రతా సంస్థ(ఎన్ఎస్ఏ) ఉద్యోగి అయిన స్నోడెన్.. దేశ, విదేశీ పౌరుల టెలిఫోన్లు, ఈ మెయిళ్లు, సోషల్ నెట్ వర్కింగ్ ఖాతాల సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ప్రపంచానికి వెల్లడించాడు. దీనిపై సర్వత్రా ఆందోళన, నిరసనలు వ్యక్తం అయ్యాయి. ప్రాణభయంతో స్నోడెన్ అమెరికా నుంచి రష్యాకు వెళ్లి అక్కడ ఆశ్రయం పొందుతున్నాడు.

  • Loading...

More Telugu News