: యువతకు కూడా గుండెజబ్బులొస్తాయ్
గుండెజబ్బులు కేవలం పెద్ద వయసు వారికే కాదు... యువతకు కూడా వస్తాయంటున్నారు పరిశోధకులు. తాజాగా నిర్వహించిన పరిశోధనలో చిన్న వయసులో ఉన్న వారికి కూడా గుండెజబ్బులు వచ్చే అవకాశముందని తేలింది.
గతంలో మహిళలకు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తక్కువని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఇరవైనుండి నలభై ఏళ్ల మధ్యవయసు ఆడవారిలో గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఈ తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు అసలు భారతీయ మహిళలు గుండెకు సంబంధించిన వ్యాధుల్ని ముందే పసిగట్టడంలో విఫలం అవుతున్నారని అసలు వాటి గురించి పట్టించుకోవడం లేదని ఈ తాజా అధ్యయనంలో 83 శాతం స్పష్టం చేశారు. ఈ పరిశోధనలో భాగంగా మెట్రో నగరాలు, కొన్ని పట్టణాల్లోనూ జరిపిన అధ్యయనంలో సుమారు ఆరు వందల మంది పాల్గొన్నారు. వీరిలో 54 శాతం మంది కార్డియాలజిస్టులు గత ఐదేళ్లతో పోల్చితే యువతులకు గుండెజబ్బు వచ్చే అవకాశం 16 నుండి 20 శాతం పెరిగినట్టు తెలిపారు.