: పోరాడి తెలంగాణ తెచ్చుకోవాలి: నారాయణ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ జేఏసీ తలపెట్టిన 'సడక్ బంద్'కు నారాయణ తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రాన్నిబతిమలాడి తెచ్చుకోవడం కాదని, పోరాడి తెచ్చుకోవాలన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని ప్రకటించడాన్నినారాయణ తప్పుబట్టారు. అది అనాలోచిత చర్య అని పేర్కొన్నారు.