: ప్రైవేటు ఫీజులుం పై ప్రజాప్రయోజన వ్యాజ్యం
ప్రైవేటు పాఠశాలల్లో రుసుములను ప్రభుత్వం నియంత్రించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు స్వీకరించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలు అమలులో ఉన్నా ప్రైవేటు కళాశాలలు డొనేషన్లు, బిల్డింగ్ ఫండ్, ట్యూషన్ ఫీజు, కరిక్యులర్ యాక్టివిటీస్, లంచ్, ట్రాన్స్ పోర్ట్ అంటూ, పలు రకాలుగా తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థల తీరుకు నిరసనగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.