: కింగ్ ఫిషర్ 'పాడైపోయిన బిర్యానీ' అట!


కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తనకు తానుగా పతనాన్ని రాసుకుందని ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోనీ ఫెర్నాండెజ్ తెలిపారు. తక్కువ ధరకు విమానాలను నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని, అందుకు సంబంధించిన ఎన్ఓసీ కోసం ఎదురు చూస్తున్నామన్న ఫెర్నాండెస్, టాటా సన్స్ తో కలిసి విమానాలను నడిపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ గురించి మాట్లాడుతూ 'విజయ్ మాల్యాకు చాలా సార్లు చెప్పాను, విమాన వ్యాపారం క్లిష్టమైనదని, అది అదృష్టాన్ని మార్చేస్తుందని తెలిపా'నన్నారు. విమాన ప్రయాణ ఛార్జీలు తగ్గించి, చిన్న నగరాలకు విమానాలను నడిపి, ప్రీమియం పేరిట విమానాలను నడిపి, ఎయిర్ డెక్కన్ తో అనుసంధానం పెట్టుకుని కలగాపులగం చేసి వైమానిక రంగ వ్యాపారాన్ని చెడిపోయిన బిర్యానీలా తయారు చేశాడని తెలిపారు.

  • Loading...

More Telugu News