: ఏ నిర్ణయం తీసుకున్నా నోరెత్తకూడదు: రాష్ట్ర నేతలకు దిగ్విజయ్ హుకుం
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ తనదైనశైలిలో పని మొదలుపెట్టారు. ఈ ఉదయం హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు. తెలంగాణ విషయంలో అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కట్టుబడి ఉండాలని ఉద్బోధ చేశారు. త్వరలోనే తాను, సీఎం, బొత్స, ఆజాద్.. కాంగ్రెస్ కోర్ కమిటీతో సమావేశమై తెలంగాణ విషయమై చర్చిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను కోర్ కమిటీ ముందు ఉంచుతామని, తుది నిర్ణయం అధిష్ఠానానిదే అని దిగ్విజయ్ స్పష్టం చేశారు.