: సురేష్ కల్మాడీ ఓటమి
ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేసిన సురేష్ కల్మాడీ ఓటమి పాలయ్యారు. ఖతార్ అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దల్హమ్ ఈ పదవిని సొంతం చేసుకున్నారు. పోటా పోటీగా సాగిన ఈ ఎన్నికల్లో కల్మాడీ స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. సురేష్ కల్మాడీ కామన్వెల్త్ క్రీడల నిధుల దుర్వినియోగం కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన గతంలో ఇండియన్ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం పుణె లోక్ సభ ప్రజాప్రతినిధిగా ఉన్నారు.