: పాకిస్తాన్ లో రాక్షసత్వం!


పాకిస్తాన్ లో ఛాందసవాదులు ఇప్పట్లో అంతరించిపోయేలా కనిపించడంలేదు. తాజా దుశ్చర్య గురించి వింటే ఎవరికైనా ఇలాంటి అభిప్రాయం కలగకపోతే ఆశ్చర్యపోవాలి. వివరాల్లోకెళితే.. గిల్గిట్ ప్రాంతంలోని ఓ కుగ్రామంలో నూర్ షేజా (16), నూర్ బస్రా (15) అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు వర్షం కురుస్తుండడంతో.. ఇంటి ఆవరణలో వాన చినుకుల్లో తడుస్తూ ఉల్లాసంగా గెంతులేయసాగారు. మరే ఇతరదేశంలోనో అయితే ఆ సోదరీమణుల నృత్యాన్ని నయనానందకరంగా భావించేవారేమో. కానీ, అది పాకిస్తాన్ అని నిరూపిస్తూ.. ఆ అక్కాచెల్లెళ్ళ సవతి సోదరుడు ఖుటోర్ రాక్షసావతారమెత్తాడు.

బహిరంగంగా కేరింతలు కొడతారా? అంటూ.. మరికొందరితో కలిసి ఆ బాలికలపై తుపాకీ గుళ్ళ వర్షం కురిపించాడు. ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపోయిన ఆ అమాయకులు తేరుకునేలోపే ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఈ ఘటనలో ఆ బాలికల తల్లి కూడా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఖుటోర్, అతని స్నేహితులు పరారీలో ఉన్నారు.

  • Loading...

More Telugu News