: మృతులు 10వేల పైనే: శశిధర్ రెడ్డి


ఉత్తరాఖండ్ వరదల్లో మృతుల సంఖ్య ఆ రాష్ట్ర స్పీకర్ చెప్పినట్లు 10వేలకుపైనే ఉండొచ్చని, సంఖ్యను ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ బహుగుణ మాత్రం మృతుల సంఖ్య ఇప్పుడే కాదు, ఎఫ్పటికీ తెలియదని, వరదల్లో ఎంత మంది కొట్టుకు పోయారన్నది చెప్పడం కష్టమని అన్నారు. వరదలు ముంచెత్తి రెండు వారాలు అవుతున్నా ఎంత మంది గల్లంతయ్యారు అన్నదానిపై ఇప్పటికీ కచ్చితమైన లెక్కలు తేలట్లేదు. విజయ బహుగుణ 3,000 మంది గల్లంతయ్యారని చెబుతుండగా, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మాత్రం 1800 అని పేర్కొంటోంది.

  • Loading...

More Telugu News