: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శని, ఆది వారాల్లో పోటెత్తిన భక్త జనం ఈరోజు కాస్త నిదానించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా, నడకదారిన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.