: వీడియో గేమ్‌లతో బోధిస్తే బాగా చదువుతారు


చిన్న పిల్లలు ఎక్కువగా ఆసక్తి చూపేది వీడియో గేములపైనే. వాటిని ఆడడం అంటే వారికి ఎంతో ఇష్టం. వీడియో గేములు ఆడడం వల్ల పిల్లలు సరిగా చదవడం లేదని తల్లిదండ్రులు మందలిస్తుంటారు. అయితే వీడియో గేములతో కూడిన బోధన ద్వారా పిల్లల్లో చదువుపై శ్రద్ధ పెరుగుతుందని తాజా అధ్యయనం చెబుతోంది.

బ్రిటన్‌లోని లాంకాస్టర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ ఏడాది ఆరంభంలో వీరు సుమారు 15 సెకండరీ పాఠశాలల్లో ఒక అధ్యయనాన్ని చేపట్టారు. ఈ అధ్యయనంలో వందమందికి పైగా విద్యార్ధులు పాల్గొన్నారు. చదువుపై పెద్దగా ఆసక్తి చూపని విద్యార్ధులను వీడియో గేములతో కూడుకున్న తరగతులతో దారిలోకి తీసుకురావచ్చని ఈ అధ్యయనంలో గుర్తించారు. ఈ విషయాన్ని గురించి చెబుతూ పిల్లలకు వీడియో గేములతో కూడిన బోధన ద్వారా వారిలో చదువుపైన ఆసక్తిని కలిగించడం ద్వారా వారిలో చదువుపట్ల శ్రద్ధ కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News