: అల్లరి నరేశ్ ఆడియో వేడుక 'కెవ్వుకేక'
టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేశ్ నటించిన తాజా చిత్రం కెవ్వుకేక. ఈ కామెడీ సినిమా ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ హోటల్ లో ఘనంగా జరిగింది . దేవీ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. అల్లరి నరేశ్ సరసన నూతన తార షర్మిలా మాండ్రే కథానాయికగా నటిస్తుండగా.. ఎంఎస్ నారాయణ, అలీ, కృష్ణ భగవాన్, కిరణ్ రాథోడ్, జీవా, ఆశిష్ విద్యార్థి, గీతాసింగ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు చిన్ని చరణ్ స్వరాలు సమకూర్చారు. కాగా, అల్లరి నరేశ్ ఈరోజుతో 30వ పడిలో ప్రవేశిస్తున్నాడు.