: పాకిస్తాన్ రక్తసిక్తం.. 17 మంది మృతి
పాకిస్తాన్ మరోసారి రక్తసిక్తమయింది. తీవ్రవాదులు భద్రతాబలగాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన బాంబు పేలుళ్ళ ధాటికి 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులుండడం అందరినీ కలచివేసింది. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెషావర్ లోని బాదాబెర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రత బలగాలు కోహెత్ నుంచి పెషావర్ వస్తుండగా అత్యంత రద్దీగా ఉన్న ఓ మార్కెట్ వద్ద కారు బాంబును రిమోట్ తో పేల్చివేశారు. పేలుడుకు సుమారు 40 నుంచి 50 కిలోల పేలుడు పదార్థాన్ని వినియోగించి ఉంటారని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీంతో, పేలుడు ధాటికి పది వాహనాలు, చుట్టుపక్కల దుకాణాల సామగ్రి తునాతునకలయ్యాయి. కాగా, పేలుడు తర్వాత భద్రత బలగాలకు, తీవ్రవాదులకు నడుమ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.