: కేసీఆర్ ది అమావాస్య, పౌర్ణమి పోరాటం: అంజన్ కుమార్


తెలంగాణ విషయంలో కేసీఆర్ పోరాటం అమావాస్యకోసారి, పున్నమికోసారి అన్నట్టుగా సాగుతుందని ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. బుద్ధిపుట్టినప్పుడే ఉద్యమం అంటారని కేసీఆర్ పై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నిజాం కళాశాలలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సాధన సభలో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసింది కాంగ్రెస్ నేతలే అని చెప్పారు. హైదరాబాద్ ఉన్న తెలంగాణనే తాము కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం తెలంగాణకు గుండెకాయలాంటిదని అంజన్ కుమార్ అభివర్ణించారు. ప్రత్యామ్నాయాలను తాము అంగీకరించబోమని ఆయన తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News