: హీరో అనిపించుకున్న సూర్య
తమిళనటుడు సూర్య సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ హీరో అనిపించుకున్నాడు. సినిమాల్లో ఆర్తులకు ఆపన్నహస్తం అందించిన రీతిలోనే వెలుపలా పెద్దమనసు చాటుకున్నాడు. ఉత్తరాఖండ్ వరదబాధితుల సహాయార్థం రూ.10 లక్షల విరాళం ప్రకటించాడు. వందల సంఖ్యలో మృతులు, వేలాదిగా ఆచూకీ తెలియకుండా పోవడం వంటి ఘటనల పట్ల సూర్య తీవ్రంగా చలించిపోయాడు. ఈ క్రమంలో తనవంతుగా ఆర్ధికసాయం అందజేస్తున్నట్టు తెలిపాడు.