: పశ్చిమ బెంగాల్లో హింస.. 20 మంది బలి
పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన హింస 20 మందిని బలితీసుకుంది. ఎన్నికలకు ఇంకా సమయమున్నా.. ప్రచార ఘట్టం మాత్రం భయానకరూపు దాల్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఇరవైమంది మరణించారు. కానీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇదసలు హింసే కాదంటోంది. ఎన్నికల వేళ ప్రశాంత వాతావారణం నెలకొంటుందని చెబుతున్నారు. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడమే ఈ హింసకు కారణమని తెలుస్తోంది.